చైనా ఓపెన్‌లో భారత్‌ అంకం ముగిసింది

B. Sai Praneeth
B. Sai Praneeth

చైనా: చైనా ఓపెన్‌లో భారత్‌ అంకం ముగిసిపోయింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో విభాగంలో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌, డెన్మార్క్‌ ఆటగాడు ఆండెర్స్‌ ఆంటోనెసెన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. అతడి ఓటమి కారణంగా భారత పోరాటం ఇంతటితో ముగిసింది. తొలుత జరిగిన రౌండ్‌లోనే ఓడిన సాయి ప్రణీత్‌, రెండో గేమ్‌లో కాస్త మెరుగ్గా ఆటని కనబర్చినా మూడో రౌండ్‌లో సొంత తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను కోల్పోయాడు. కాగా సాయి ప్రణీత్‌ ఓటమితో భారత్‌ సింగిల్స్‌ పోరాటం ముగిసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/