ఇంత జరిగినా స్పందించని చైనా

china not respond over pulwama attack
china

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వా§్‌ుపై జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. కానీ చైనా మాత్రం ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. కనీసం దాడిని ఖండించనూ లేదు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చేసిన దాడిలో 49 మంది జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు కూడా చైనా ఎప్పటి నుంచో అడ్డుపడుతున్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా తప్ప మిగతా దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు అంగీకరించినా చైనా మాత్రం తన వీటో పవర్‌తో అడ్డుకుంటున్నది.