క్రీడారంగాన్నీ కుదిపేస్తున్న కరోనా వైరస్‌

ఈ నెల 25 నుంచి ఆరంభం కావాల్సిన చైనా మాస్టర్స్‌ను వాయిదా

China Masters badminton postponed over virus outbreak
China Masters badminton postponed over virus outbreak

బీజింగ్‌: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ప్రాణంతక కరోనా వైరస్‌ క్రీడారంగాన్నీ కుదిపేస్తోంది. క్రీడాకారులు ఆందోళన చెందుతుండటంతో ఈ నెల 25 నుంచి ఆరంభం కావాల్సిన చైనా మాస్టర్స్‌ను నిర్వాహకులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చైనా ప్రాంతంలోని హైనస్‌ ద్వీపంలో ఈ పోటీలు జరగాల్సి ఉంది. అత్యవసర ఆరోగ్య పరిస్థితి, రక్షణ, క్రీడా సామాగ్రి రవాణాను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం టోర్నిని వాయిదా వేయడం మంచిదేనని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు పోటీ నుంచి తప్పుకున్నారని వెల్లడించింది. కరోనాతో వణికిపోతున్ను వుహాన్‌లోనే ఏప్రిల్‌లో ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించాల్సి ఉంది. చైనాలోని వుహాన్‌లో తొలుత వ్యాపించిన కరోనా వైరస్‌ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 259 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో అక్కడ టోర్ని నిర్వహణ కష్టమే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/