భారతీయులపై కోవిడ్ వీసా నిషేధాన్నిఎత్తేసిన చైనా

బీజింగ్ : కరోనా సందర్బంగా భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. భారతీయ ప్రొఫెషనల్స్‌, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్‌ వీసా పాలసీ అప్‌డేట్‌ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కు టుంబసభ్యులు, చైనాలో శాశ్వత నివాసం ఉన్న విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా కాలేజీలు, వర్సిటీల్లో తిరిగి చేరాలనుకునే భారత విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటున్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/