నింగిలోకి చైనా కొత్త ఉపగ్రహం

China launches new high-resolution mapping satellite

తైయువాన్‌: చైనా ఉత్తర ప్రావిన్స్ షాంక్సిలోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి శనివారం తన కొత్త హైరిజల్యూషన్ మ్యాపింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. జియువాన్ III 03 ఉపగ్రహాన్ని తన శక్తివంతమైన రాకెట్‌ లాంగ్‌మార్చ్‌4 బి ద్వారా ఉదయం 11:13 గంటలకు (బీజింగ్‌ టైమ్‌) ప్రయోగించినట్లు చైనా అంతరిక్ష కేంద్రం వెల్లడించింది. లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ సిరీస్‌లో ఇది 341వ ప్రయోగం. లాంగ్‌మార్చ్‌ అనేది చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న రాకెట్ల ప్రయోగవ్యవస్థ శ్రేణి. ఈ రాకెట్‌ ద్వారా డార్క్ మ్యాటర్ డిటెక్షన్, కమర్షియల్ డేటా సేకరణ కోసం మరో రెండు ఉపగ్రహాలను కూడా పంపించారు. వీటిని షాంఘై ఏఎస్‌ఈఎస్‌ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మూడు ఉపగ్రహాలు ముందుగానే నిర్దేశించిన కక్ష్యల్లోకి ప్రవేశించాయని తైయువాన్ కేంద్రం వర్గాలు తెలిపాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/