సీఎం జగన్ ను కలిసిన జీయర్ స్వామి

రామానుజా చార్యుల సహస్రాబ్ది మహోత్సవాల ఆహ్వానం అందజేత

Sri Sri Sri Tridandi Ramanuja china jeeyar Swamy met CM Jagan. YV Subba Reddy also seen

తాడేపల్లి: సీఎం జగన్ మోహన్ రెడ్డి ని శనివారం ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి కలిశారు. ఈ సందర్భంగా రామానుజా చార్యులు అవతరించి వెయ్యేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. సీఎం నివాసానికి చేరుకున్న చినజీయర్‌ స్వామిని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చినజీయర్‌ స్వామితో పాటు ముఖ్యమంత్రిని మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు క‌లిశారు.

తెర-సినిమా వార్తలకు : https://www.vaartha.com/news/movies/