రష్యా మాదిరే చైనా కూడా భారత్‌పై దండెత్తే ప్రమాదముంది : రాహుల్
నరేంద్ర మోడీ సర్కారు ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేదని ఆందోళన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా దురాక్రమణ వైఖరిని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడానికి కారణం రష్యా దురాక్రమణ వాదమే. ఉక్రెయిన్‌లోని డొనెట్క్స్, లుహాన్క్స్ ప్రాంతాలు అసలు ఉక్రెయిన్ అంతర్భాగాలని రష్యా భావించడం లేదు. అసలు దేశాల మధ్య సరిహద్దులను కూడా రష్యా గౌరవించడం లేదు. కేవలం ఈ భావనతోనే ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తింది. ఈ దండయాత్ర వెనుక అసలు లక్ష్యం నాటో, అమెరికాల నుంచి ఉక్రెయిన్ విడదీయడమే నని రాహుల్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మీద తనదైన విశ్లేషణను వినిపించారు.
రష్యా తరహాలోనే భారత పొరుగు దేశం చైనా కూడా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ సరికొత్త వాదనను వినిపించారు. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లో ఎప్పటికప్పుడు సరిహద్దు వివాదాన్ని రేపుతున్న చైనా… అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా నిలుస్తోంది. రష్యా మాదిరే చైనా కూడా దేశ సరిహద్దులను గౌరవించడం లేదు. ఈ దురాక్రమణలను మోడీ సర్కారు గుర్తించడం లేదు. సరైన సమయంలో మేల్కొనకపోతే ఉక్రెయిన్‌పై రష్యా ఎలాగైతే దాడి చేసిందో.. అదే మాదిరిగా చైనా కూడా మన దేశంపై దాడి చేస్తుంది అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/