చైనాలో కొత్త చట్టం!

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష

బీజింగ్: పిల్లలు ఏదైనా తప్పు చేస్తే.. ముందు నిందించేది వాళ్ల తల్లిదండ్రులనే. పిల్లలను సరిగ్గా పెంచడం చేతకాదా? అని తిడుతుంటారు. పిల్లల మనస్తత్వం ఎలా ఉన్నా.. వాళ్లు చెడిపోయినా.. బాగుపడినా.. చివరకు అనేది తల్లిదండ్రులనే. పిల్లల వల్ల సమాజంలో ఏవైనా సమస్యలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు. అందుకే.. పిల్లలు తప్పు చేస్తే.. ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేస్తామని.. చైనా ప్రకటించింది. దానికి సంబంధించిన కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.

ఆ చట్టం ప్రకారం పిల్లల్లో ఏవైనా మార్పులు కనిపించినా.. వాళ్లలో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ను అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బిల్లును చైనా ప్రభుత్వం రివ్యూ చేస్తోంది. ఆ బిల్లు ప్రకారం.. తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి చెప్పాలి. చట్టాల మీద అవగాహన తీసుకురావాలి. ఇతరులకు సాయం చేసే గుణాన్ని పిల్లల్లో పెంపొందించాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో పాజిటివ్ ఆటిట్యూడ్ ను పెంచేలా చేస్తే భవిష్యత్తులో పెద్దయ్యాక వాళ్ల వల్ల ఎటువంటి నష్టాలు వాటిల్లవు.. అని బిల్లులో పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/