అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చైనా తహతహ

TRUMP, JINPING
TRUMP, JINPING

వాషింగ్టన్‌: ట్రేడ్‌వార్‌ దెబ్బకు చైనా దేశం అల్లాడిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఏదో ఒక రకంగా వాణిజ్య ఒప్పందం కదుర్చుకోవాలని చైనా తహతహలాడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలతో వాణిజ్య యుద్ధం మరింత రగులుకునే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల చైనా కంపెనీలపై బిలియన్ల కొద్లీ టారిఫ్‌లు వసూలు చేస్తుండడంతో ఆ కంపెనీలు చైనాను వదిలి అమెరికాకు వస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనా ఉవ్విళ్లూరుతుంది. చైనా వారు టారిఫ్‌ల దెబ్బకు ఇబ్బంది పడి, ఆ కంపెనీలు టారిఫ్‌లను చెల్లించడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. చైనాతో పాత డీల్‌లో నాలుగైదు అభ్యంతరాలున్నాయి. ఐతే పాత డీల్‌ అంగీకరించేవరకు కొత్త డీల్‌పై తనకెలాంటి ఆసక్తి లేదని ట్రంప్‌ శ్వేతసౌధంలో తేల్చి చెప్పారు.
మాజీ ఉపాధ్యక్షుడు జో బైడన్‌ చైనాతో బాగా డీల్‌ చేయలేకపోయారని విమర్శించారు. ఆయన డమ్మీగా మిగిలిపోయారన్నారు. చైనా తమకు పోటీకాదని ఆయన భావించినట్లున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. కాని అమెరికాకు చైనా ప్రధాన పోటీదారు అని ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం, ఐతే ఆ దేశం ఇప్పుడు వాణిజ్య ఒప్పందం కోసం తహతహలాడుతుంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos