విరివిరిగా పెరిగిపోతున్న చైనా డ్రోన్‌లు

China's drone
China’s drone


జింగ్‌ : ప్రస్తుత ఆధునిక మానవుని జీవితంలో డ్రోన్‌ వినియోగం విరివిగా పెరిగింది. కొంత ఎత్తు నుంచి భూమి మీద ఫొటోలు తీయడం, పొలాల్లో పైనుంచి ఎరువులను చల్లడం, వస్తువులను రవాణా చేయడం వంటి పనులను ఈ డ్రోన్లు చేస్తాయి. డ్రోన్ల ఉత్పత్తి మార్కెట్లో చైనా క్రమక్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం దాదాపు 12 లక్షల డ్రోన్లను ఇతర దేశాలను ఎగుమతి చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ ఎగుమతుల్లో దాదాపు 70 శాతం దాకా ఉన్నాయి. 2019, జూన్‌ నాటికి ఇక్కడ వినియోగిస్తున్న డోన్ల సంఖ్య 3 లక్షల 39 వేలకు చేరింది. చైనా డ్రోన్‌ తయారీ సంస్థ ‘డిజెఐ’ విజయం కూడా ఈ పరిశ్రమను ప్రోత్సహించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ డిజెఐ డ్రోన్లను అటవీ పెట్రో లింగ్‌, కరెంట్‌ సరఫరా లైన్ల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అధికంగా వినియోగిస్తారు. 2020 నాటికి చైనా డ్రోన్‌ మార్కెట్‌ను 60 బిలియన్‌ యువాన్లకు చేర్చేందుకు ఆ దేశం ప్రణాళికలు రచిస్తోంది. అదేవిధంగా 2025 నాటికి 180 బిలియన్‌ యువాన్లకు చేరుకుంటుందని చైనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/