బాహ్య ఒత్తిడులకు చైనా లొంగదు

China -US
China -US


బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ టారీప్‌లు పెంచడంతో చైనా వాణిజ్యశాఖ స్పందించింది. చైనా ఎన్నటికీ లోంగిపోదు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచంలోని రెండు దిగ్గజ ఆర్థిక శక్తుల మధ్య శుక్రవారం వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. 200బిలియన్‌ డాలర్లు విలువైన వస్తువులపై టారీఫ్‌లు విధించడంతో ఈ వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. అంతేకాక దీనిలో ఆజ్యం పోస్తూ ట్రంప్‌ మరో 300 బిలియన్‌ డాలర్ల వస్తువులపై కూడా టారీఫ్‌లను సిద్ధం చేయాలని తన అధికారులకు చెప్పారు. దీనిపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్‌ షంగ్‌ తెలిపారు. ఖఖపూర్తి వివరాలు వచ్చే వరకు వేచి చూడాలన్నారు. బాహ్య ఒత్తిడులకు చైనా లొంగదు. మా హక్కులను కాపాడుకొంటామనే నమ్మకం మాకుంది అని తెలిపారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/