బీజింగ్ కోర్టు లో చైనా మీటూ కేసు కొట్టివేత

బీజింగ్ : చైనాలో సంచ‌ల‌నం రేపిన మీటూ కేసును ఆ దేశ కోర్టు కొట్టివేసింది. ఫేమ‌స్ టీవీ హోస్ట్‌పై న‌మోదు అయిన లైంగిక వేధింపు కేసును బీజింగ్ కోర్టు నిరాక‌రించింది. ఈ కేసులో జూ జున్‌ను దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు లేవ‌ని కోర్టు పేర్కొన్న‌ది. జువో జియాజున్ అనే మ‌హిళ .. సీసీటీవీ హోస్ట్ జూ జున్‌పై కేసు వేసింది. ఇంటెర్న్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో అత‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆ మ‌హిళ త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది.

బ‌ల‌వంతంగా శరీరాన్ని తాకేవాడ‌ని, కిస్సులు ఇచ్చేవాడ‌ని ఆమె ఆరోపించింది. ఈ కేసుతో మీటూ ఉద్య‌మంపై చైనాలో అవ‌గాహ‌న పెరిగింది. 2014లో జున్ వేధించాడ‌ని ఆమె 2018లో ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లు త‌మ ఫిర్యాదుల‌ను న‌మోదు చేసేందుకు ఈ కేసు స‌హ‌క‌రించింది. అయితే లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌ను సీసీటీవీ హోస్ట్ జున్ ఖండించారు

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/