ప్రధాని లడఖ్ పర్యటనపై స్పందించిన చైనా
పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చొద్దు..చైనా

బీజింగ్: ప్రధాని నరేంద్రమోడి లడఖ్ పర్యటనపై చైనా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని ప్రధాని మోడి పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా గల్వాన్ ఘర్షణల నేపథ్యంలోప్రధాని ఈరోజు ఉదయం లడఖ్‌లోఆకస్మిక పర్యటనకు వెళ్లారు. మిలిటరీ ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుతం గల్వాన్‌లో నెలకొని ఉన్న పరిస్థితిని సమీక్షించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/