చైనా వస్తువులను బహిష్కరించండి.. నెటిజన్ల ట్వీట్లు

china articles will be ban
china articles will be ban


న్యూఢిల్లీ: జేషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త విన్నప్పటినుంచి చైనా ఉత్తత్తులను నిషేధించండి అన్న హ్యాష్‌టాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. అమెరికా , యూకే, ఫ్రాన్స్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ ప్రతిపాదన తీసుకురాగా.. చైనా దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం నాలుగోసారి కావడం విశేషం. అప్పటి నుంచి ట్విట్టర్‌లో చైనాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఒకరు ట్వీట్‌ చేస్తూ ..1945లో జపాన్‌పై అమెరికా బాంబు వేసిన తర్వాత ఇప్పటి వరకు జపాన్‌ దేశస్తులు అమెరికా వస్తువులను వాడటం లేదని, దేశభక్తి అంటే ఇదీ అని మరోకరు ట్వీట్‌ చేశారు.