చైనా-అమెరికా దేశాల కీలక నిర్ణయం

TRUMP, JINPING
TRUMP, JINPING

చైనా: చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నెలలుగా ఇరు దేశాలూ ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధిస్తూ వచ్చిన సుంకాలను రద్దు చేసేందుకు అంగీకరించినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మద్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించడమే కాకుండా అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. తుది ఒప్పందం దిశగా అడుగులు వేశారు అని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/