సమ్మె చేస్తున్న చిలీ వాల్‌మార్ట్‌ ఉద్యోగులు

Workers of Walmart
Workers of Walmart

శాంటియాగో: చిలీలో దేశవ్యాప్తంగా వాల్‌మార్ట్‌ స్టోర్స్‌లో పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టటంతో అవి నిరవధికంగా మూతపడే పరిస్థితి నెలకొంది. చిలీ ప్రైవేటు రంగ చరిత్రలోనే అత్యంత భారీ ఆందోళనగా పరిగణిస్తున్న ఈ సమ్మె త్వరలోనే మరో 276 స్టోర్లకు విస్తరించనున్నదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. వాల్‌మార్ట్‌ యాజమాన్యం ఉద్యోగుల స్థానంలో ఆటోమేటెడ్‌ క్యాషియర్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుండటంతో దాదాపు 2 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ యంత్రాలపై శిక్షణనిచ్చేందుకు ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాల్సి వుంటుందని యాజమాన్యం పేర్కొంది. యాంత్రిక నగదీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న యాజమాన్యం నిర్ణయానికి వ్యతిరేకంగా గత నెల 2527 తేదీల్లో సమావేశమైన ఉద్యోగులు తమ పరిస్థితులపై చర్చించి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. దాదాపు 91.75 శాతం మంది ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనకు మద్దతు తెలపటంతో యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన తరువాత చట్టపరమైన ఐదు రోజులగడువు ముగిసిన అనంతరం ఉద్యోగులు బుధవారం నుండి నిరవధిక సమ్మె బాట పట్టారు.
తాజా తెలంగా

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/