పిల్లల రైలు

బాలగేయం

పిల్లల రైలు

Children's Train

Children’s Train

చుక్‌ చుక్‌ చుక్‌ చుక్‌ -ధఢక్‌ ధఢక్‌ చుక్‌ చుక్‌ చుక్‌చుక్‌ – ధఢక్‌ ధఢక్‌ పిల్లల రైలు వస్తోంది పిల్లలందరూ ఎక్కండి కూకూ.. కూకూ.. కూకూ.. ”చుక్‌ చుక్‌ అందరు మెచ్చిన రైలు ఇది పిల్లలు తెచ్చిన రైలు ఇది నేలా నీరూ ఆకాశం అంతట తిరిగే రైలు ఇది కూకూ.. కూకూ… ” చుక్‌ చుక్‌ పిల్లల్లారా రారండి దేశాలన్నీ తిరిగేద్దాం సంద్రాలన్నీ దాటేద్దాం ఖండాలన్నీ చూసొద్దాం కూకూ.. కూకూ.. ”చుక్‌ చుక్‌ సరదా యాత్రకు వెళ్లొద్దాం మబ్బుల షికారు చేసేద్దాం చంద్రమండలం చుట్టేద్దాం చుక్కల లోకం చూసొద్దాం కూకూ.. కూకూ.. ”చుక్‌చుక్‌

 – డా.వి.ఆర్‌.శర్మ