పిల్లలు త్వరగా నిద్రపోవటం లేదా ?

చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పెద్దల బాధ్యత

కొందరు పిల్లలు రాత్రి 10 గంటలు దాటినా కూడా స్మార్ట్ ఫోన్, టివి చూస్తూ ఉంటారు. ఆలస్యంగా పడుకోవటం వలన తొందరగా నిద్ర పట్టదు.. దీంతో ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు.. పిల్లలను సమయానికి నిద్ర పుచ్చేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే..


పిల్లలు ప్రతి రోజు ఒకే వేళకు నిద్ర పోయేలా, ఉదయాన్నే ఒకే సమయానికి లేచేలా చూడాలి.. దీంతో వారు చక్కగా నిద్రపోతారు.. ఫలితంగా వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది..

నిద్ర వచ్చేంతగా వరకు పిల్లలు టివి చూస్తూనో,, లేదంటే, స్మార్ట్ ఫోన్ చూస్తూనో గడిపేస్తుంటారు.. దీంతో ఆలస్యంగా నిద్ర పోతుంటారు.. అలా కాకుండా తల్లిదండ్రులు వారికి కథల పుస్తకాలు చదివి వినిపించాలి.. కథలు వింటున్నప్పుడు పిల్లలు వింటూ వింటూ నిద్రలోకి జారుకుంటారు..

If parents tell good stories to children at night, they will fall asleep immediately

గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి.. పిల్లలు నిద్రపోతున్నప్పుడు టీవీ వాల్యూం చిన్నగా పెట్టాలి.. అపుడు వారికి తొందరగా నిద్ర పడుతుంది..

పిల్లలు రాత్రి చక్కగా నిద్ర పోవాలంటే వారి చిన్న బుర్రలో ఏ భయాలు లేకుండా చూడాలి.. అందుకోసం తల్లిదండ్రులు వారితో సరదాగా గడపాలి.. వార్ భయాలను తెలుసుకుని వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి.

Sleeping Boy

నిద్ర సమయానికి ముందు పిల్లలకు చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వొద్దు.. జింక్ ఫుడ్ వంటివి తినిపిస్తే నిద్ర పట్టడం ఆలస్య మవుతుంది.

అలాగే పిల్లలకు ఏదైనా ఇస్తాం.. అంటే ఉత్సాహంగా చేపియినా మాట వింటారు.. తొందరగా నిద్రపోతే నీకు అవసమైనది కొనిస్తాం ..అని చెప్పారనుకోండి.. వాళ్లు వెంటనే నిద్రపోతారు.

పిల్లలకు సంబందించిన కథలు , వ్యాసాలకు (మొగ్గ) క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/kids/