పిల్లల బిల్డింగ్‌ బ్లాక్స్‌..

ఆట వస్తువులు

పిల్లలకు బిల్డింగ్‌ బ్లాక్స్‌ ఓ సరదా వ్యాపకం. వాటిని వాళ్ల ముందు వేస్తే బ్లాక్స్‌ని రకరకాల ఆకృతుల్లో పేరుస్తూ గంటలు గంటలు వాటితోనే ఆడుతుంటారు.

అయితే మెదడుకు పదును పెట్టే ఆ ఆటని ఇంట్లో మాత్రమే ఆడుకోగలరు చిన్నారులు. అదే బస్సులోనో, స్కూల్లో ఖాళీ టైమ్‌లోనే కూడా ఆడుకోవాలనుకునే పిల్లలకి ఈ బిల్డింగ్‌ బ్లాక్స్‌ పెన్సిల్‌ బాక్సును ఇస్తే సరి. అది చూడ్డానికి పెన్సిల్‌ బాక్సులాగా ఉంటుంది.

అందులో పెన్సిళ్లూ, పెన్నూలు విడివిడిగా పెట్టుకోవచ్చు. దానిమూత పైభాగంలో బొడిపెలు ఉంటాయి. వాటిమీద గుచ్చడానికి రకరకాల రంగుల్లో ఉన్న బ్లాక్స్‌ కూడా ఈ బాక్సుతోనే వస్తాయి. ఆ బొడిపెల్లో ఈ బ్లాక్స్‌ను గుచ్చుతూ నచ్చిన డిజైన్‌ని చేసుకోవచ్చు.

కావాలంటే ఆ డిజైన్‌ను అలాగే ఉంచేసుకోవచ్చు కూడా. చిన్నారులకు ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ పెన్సిల్‌ బాక్సులు పలు రంగుల్లో దొరుకుతున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/