పిల్లలకు ప్రేమగా చెప్పాలి

Mother with children

అమ్మకు పిల్లలు అమ్మా! నన్ను స్కూల్లో ఏడిపిస్తున్నారు, నేను వారితో ఫ్రెండ్షిప్‌ చేయను అంటూ పిల్లలు అమ్మకు ఫిర్యాదు చేయడటం సాధారమే. పక్కవారి వస్తువులు తీసుకోవటం, అబద్దాలు చెప్పటం పిల్లలు చేసేదే. అయితే పెద్దయ్యాక వాళ్లు మారుతారులే అని తేలిగ్గా తీసుకోకూడదు. మొక్కగానే వంచేయాలి అన్నట్లు ఎప్పటికప్పుడు మార్చే ప్రయత్నం చేయాలి. పిల్లలు తనను పక్క వారు కొడుతున్నారని చెపుతుంటారు. తీరి స్కూలుకి వెళితే తమ పిల్లలే పక్క వారిని కొడుతున్నారని వారితో గొడవపడుతున్నారని టీచర్‌ తల్లితో చెబితే ఎలా ఉంటుంది. ఇటువంటి విషయాలను కొన్నిసార్లు తల్లికూడా నియంత్రించలేకపోవచ్చు. అందుకే తోటి పిల్లలతో గొడవ పడటం, వారిని కొట్టడం వంటివేవీ చిన్న విషయాలు కావు. కొన్ని సార్లు వాటిని పెద్దలూ నియంత్రించలేరు. అలాంటి పిల్లలు పెద్దయ్యాక కూడా తల్లిదండ్రులతో వితండవాదం చేస్తుంటారు. తాను చేసేది తప్పు కాదని వాదిస్తారు. లేదా ఇతరులపై ఆ తప్పుల్ని రుద్దతారు.

ఈ క్రమంలో పెద్దల్ని శత్రువల్లా భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలానే కారణం లేకుండా కక్ష్య సాధిస్తున్నట్లుగా ప్రవర్తించడం, తోబుట్టువులపైనా ద్వేషం పెంచుకోవడం చేస్తుంటారు. నచ్చిన వస్తువులు ఎలాగైనా సొంతం చేసుకోవాల నుకుంటారు. ఇలా చాలా రకాల ప్రతికూలతు పిల్లల్లో కనిపిస్తుంటే వీలైనంత త్వరగా అదుపు చేయాలి. లేదా అవసరం అనుకుంటే మానసిక నిపుణులను సంప్రదించాలి. ప్రవర్తనాపరమైన చికిత్సలతో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. అలాగే ఇంటి పరిస్థితులు ఎంత వరకు వారి మీద ప్రభావం చూపుతున్నాయో గమనించాలి.

ఎలాంటి వాతావరణం కల్పించాలనే అవగాహన తల్లిదండ్రులకు ఉండటం కూడా చాలా అవసర ంఅంటున్నారు నిపుణులు. 80 శాతం మంది చిన్నారు. జన్మతః బాగుంటారు. ఇరవై శాతం మంది మానసిక అవలక్షణాలతో ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదటి ఎనభై శాతం మందికి ఇల్లూ, కుటుంబసభ్యులే తొలి ప్రపంచం. తరువాత వారిపై స్నేహితులూ, పాఠశాల ప్రభావం ఉంటుంది. అప్పుడే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టిన చిన్నారులకు పెద్దలు అద్దంలాంటివారు. చిన్నారులు వారిని చూసే నేర్చుకుంటారు.

అంటే మంచైనా, చెడైనా పెద్దలు ఏది చేస్తే పిల్లలు అదే ఆచరించాలని అనుకుంటారు. పెద్దలు సరదాకో, అవసరానికో అబద్ధాలాడటం చూస్తే ఆ తరువాత నుంచి వారు అలా చేయడం తప్పు కాదనే నిర్ణయానికి వచ్చేస్తారు. మిగిలిన 20 శాతం చిన్నారుల్లో పుట్టుకతోనే కొన్ని స్వభావాలుంటాయి. వారి గుణంలో సానుభూతి, దయా ఉండకపోవడంతో హింసాత్మకమైన కోణం పెరిగేకొద్దీ కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారిపై అమ్మానాన్నలు ఫిర్యాదులు చేసు కోవడం, పక్కింటివారి గురించి ఆరోప ణలు, బంధువుల్ని, స్నేహితుల్ని నిందించడం వంటివి పిల్లల్లో కండక్ట్‌ డిజార్డుకు బీజం పడేలా చేస్తాయి. తల్లిపై తండ్రి దాడి చేసినా చిన్నారుల మనసులో ప్రతికూల భావం పడుతుంది.

క్రమంగా అది పెరిగి ఇతరుల్ని హింసించడంలోనే ఆనందం ఉందనుకుంటారు. అలాగే ఇంట్లో అమ్మానాన్నలు నిత్యం గొడవపడుతూ వాదించుకుంటుంటే వారికి ఇతరులపై ద్వేషం పెరుగుతుంది. దీనివల్ల కొందరు సమాజాన్ని ద్వేషించడం మొదలుపెడతారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.

ప్రతి విషంలో వారికి మార్గనిర్దేశకులుగా ఉండాలి. పెద్దలతో అన్ని పంచుకునే చొరవ ఇవ్వాలి. అమ్మకి చెబితే ఏమవుతుందో అనే బెరుకు లేకుండా చూసుకోవాలి. అబద్ధాలు చెబితే వెంటనే దాన్ని మానేసేలా చూడాలి. కథల రూపంలో నిజాయితీగా ఉండటం వల్ల కలిగే లాభాల్ని వారికి తెలపాలి. పిల్లలు బడి నుంచి రాగానే ఆటలు ఆడుకునేందుకు ఫోన్లకు పరిమితం కాకుండా కబుర్లు చెప్పాలి. తరగతిలో విషయాలు తెలుసుకోవాలి.

పలు రకాల ప్రశ్నలు వేసి వారిలో మాట్లాడించాలి. అప్పుడే బడిలో తోటివారితో ఉండే విధానం, ఇతర పిల్లల పట్ల వ్యవహరించే తీరు తెలుస్తుంది. వారు చెప్పే సమాదానాల్ని బట్టి పిల్లల మానసిక స్థితిని కొంతవరకు అంచనా వేయవచ్చు. రోజు వారి డైరీ చదవాలి. ఉపాధ్యాయులురాసే ఫిర్యాదులూ, ప్రశంసలూ తెలుసుకోవాలి. వీలైలే వారానికోసారి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి చదువులో ఎలా ఉన్నారన్నది తెలుసుకోవాలి.

వారి స్కూల్‌ బ్యాగుల్లో కొత్త వస్తువులు కనిపిస్తే ఎక్కడివని ఆరా తీయాలి. వెంటనే తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయాలి. పిల్లలు సున్నిత మనస్కులు. తమ ముందు పెద్దలు వాదించుకున్నా ఇతరుల ముందు పెద్దలు తమని తిట్టినా తట్టుకోలేరు. కాబట్టి తల్లిదండ్రులు వారి ముందు పరస్పరం మర్యాదగా ఉండే ప్రయత్నం చేయాలి. పిల్లల్ని కసుకుంటూ, విసుక్కుంటూ ఉండకూదడు. వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలి. తప్పు చేస్తే నిదానంగా మందలించాలి. మంచి పనులు ప్రశం సించి, బహుమతి ఇవ్వాలి. చిన్నారులకు పచ్చని పూల కుండీలు, పెంపుడు జంతువులూ, ఆక్వేరియం వంటివి బహు మతిగా ఇచ్చేందుకు ప్రయత్నించాలి. వాటిని ప్రేమగా చూసుకునే క్రమంలో వారిలో ఒత్తిడి దూరమవుతుంది. ప్రేమను పంచే గుణ ం అలవడుతుంది. ఒక్కోసారి చిన్న సమస్యే కదాని వారిని వది లేస్తే అది తీవ్ర తప్పిదానికి కారణమవుతుందని గుర్తించాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/