ఎత్తు పెరగటం లేదా ?

పిల్లలు.. ఆరోగ్యం.. అలవాట్లు..

Height growth of children

పిల్లలు తగినంత ఎత్తు పెరగక పోతే తల్లి దండ్రులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. పిల్లలు సాధారణంగా యుక్త వయస్సు వచ్చే వరకు ఎత్తు పెరుగుతారు.. కాబట్టి బాల్యం నుంచే తగినంత ఎత్తు పెరిగేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.. పిల్లలకు పాలు, పాల ఉత్పత్తులతో తాజా పండ్లు ఇవ్వాలి… పాలలో కాల్షియం ఉంటుంది… ఎస్సెన్షియల్ మినరల్స్ ఉంటాయి.. ఇవి ఎముకల ఎదుగుదలకు బాగా ఉపకరిస్తాయి… పెరుగు, పన్నీర్, చీజ్ వంటివి కూడా రోజూ మెనూలో ఉండేలా చూడాలి..

పిల్లలు కార్బోనేటేడ్ డ్రింక్స్ , కెఫీన్ వున్న డ్రింక్స్ ఎక్కువగా తాగకుండా చూడాలి.. వాటికి బదులుగా ఆ రోజు నీళ్లు ఎక్కువగా తాగేలా చూడాలి.. నీళ్లు ఎక్కువగా తాగటం వలన బాడీ మెటబాలిజం పెరుగుతుంది.. టాక్సిన్స్ పోయి జీర్ణ శక్తి పెరుగుతుంది.. ఎముకల పెరుగుదల బాగుంటుంది.. పిల్లలు రోజూ తగినంత నిద్ర పోయేలా చూడాలి. శరీరానికి సరిపడా నిద్ర లభించినప్పుడు పెరుగుదల ఉంటుంది.. కణ జాలానికి తగినంత రెస్ట్ లభించినప్పుడు శరీరంలో పెరుగుదల చోటుచేసుకుంటుంది..

పిల్లలు ఆటలు

పిల్లలు ఎక్కువ ఆటలు ఆడేలా చూడాలి.. వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి.. క్రికెట్, ఫుట్ బాల , బాస్కెట్ బాల్, వాలీ బాల్ , టెన్నిస్, స్విమ్మింగ్ వంటి ఆటలు ఆడటం వాళ్ళ మంచి ఫలితం ఉంటుంది.. ఆట ఏదైనా ఫీజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటే గ్రోత్ బాగుంటుంది.. యోగాసనాలు కూడా పిల్లలు ఎత్తు పెరగటానికి దోహద పడతాయి ..

ఆధ్యాత్మిక వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/