పిల్లలకూ ఛాయిస్ ఇవ్వండి.

పిల్లల పోషణ – సంరక్షణ

Children care -Give them a chance
Children care -Give them a chance

పిల్లలపై పేరెంట్స్ కు మమకారం ఉంటుంది. కొందరు అసలు తమ పిల్లలకు కష్టమే తెలియకుండా పెంచాలనుకుంటారు. ఇంకొందరు వారు అడగకుండానే అన్ని అవసరాలు తీరుస్తుంటారు. ఇలాంటివి పిల్లలకు లోకజ్ఞానం తెలియనివ్వవు . ఇక వారు ప్రతిదాంట్లో ఇతరులపై ఆధారపడే పరిస్థితి తెచ్చుకుంటారు. ..అలా కాకుండా ఉండాలంటే ..
పెద్దలు ఎపుడు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి. అంటే కష్టాలకు వెరవకుండా , నిలబడ గలిగే వ్యక్తిత్వాన్ని వారికి అలవాటు చేయాలి. భావోద్వేగాలను ఖ్డుపు చేసుకోవటం నేర్పాలి . పిల్లల ఇష్టా ఇష్టాలను అర్ధం చేసుకోవాలి. అలాగని వారు కోరిందల్లా సులువుగా అందుతుంటే .. శ్రమించే అలవాటుని తగ్గించుకుంటారు. క్రమంగా ఏది సంపాదించాలన్న సులువైన దారులను వెతుకుతూ ఉంటారు. . అది వారి జీవన శైలి, జీవితాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు. అందుకే అవసరానికి మించి పిల్లలు ఏది కోరుకున్నా.. చిన్న టాస్కులు ఇచ్చి పూర్తి చేస్తేనే ..అని చెప్పండి. ఇది వారిలో స్వయంకృషిని అలవాటు చేస్తుంది . పెద్దల అలవాట్లు, ఆలోచనలే పిల్ల పైన ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు ముంది క్రమశిక్షణను, నీటి నిజాయితీలను అలవర్చుకోండి . ఆడంబరంగా మాట్లాడటం, ఎదుటివారిని కించపరచటం వంటివి చేయొద్దు. మీ బిడ్డలు అలా చేస్తుంటే. కచ్చితంగా ఆ తీరుకి అడ్డుకట్ట వేయండి.. అపుడే నిరాడంబరతకు వారు అలవాటు పడతారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/