Do children eat without a mobile ?
అన్నం తిననని మారం చేసి పిల్లలకు చందమామని చూపించి తినిపించేవాళ్ళు పాతతరం . ఇప్పటి వాళ్ళకి ఆ స్థానంలోకి మొబైల్ , టీవీ వచ్చి చేరాయి. ఇపుడు అవి లేనిదే నోరు తెరవమని మారం చేసే గడుగ్గాయిలే ఎక్కువ .. ఈ తీరు అంత మంచిది కాదనేది నిపుణుల మాట. మరి మార్చేది ఎలా ?.. ఇదిగో ఇలా.
భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులు కావటం , మారం చేయటం అవుతారనో , త్వరగా తినేస్తారానో మొబైల్ చూపించటం మొదలైంది. లాక్ డౌన్ తర్వాత వీటి అవసరం దాదాపు ప్రతి ఇంట్లో తప్పని సరి అయింది. పరిస్థితుల్లో మార్పు వచ్చినా అది ఉంటేగానీ తినమనే పిల్లలే ఎక్కువ. కానీ దాన్ని ఇకనైనా కొనసాగనివ్వ కండి. ఆ రోజుకి తిన్నారనిపించినా, దీర్ఘ కాలంలో వారికి ఆ మారంపై ఆసక్తిని కలుగజేస్తుంది.. తినే విధానమూ తెలియదు. కొన్నిసార్లు ఎంత తింటున్నారనేది తెలియక అతిగా తినేసి జీర్ణ సంబంధ సమస్యలు, ఊబకాయానికి కారణమవుతాయి. కాబట్టి ..
సమయం నిర్ణయించండి..
ఒక్కసారిగా గాడ్జెట్లకు దూరం చేయాలని చోదకండి. అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముందు నిర్ణీత సమయాన్ని కేటాయించండి. దానిలోగా పూర్తిచేయాలని చెప్పండి. అవసరమైతే ఈ విషయంలో కఠినంగా ఉండండి. దీంతో త్వరగా తినేయాలన్న దానిపైనే ధ్యాస ఉంటుంది.
పిల్లల్ని కొట్టవద్దు..
ఫోన్ దూరం చేయాలన్న పట్టుదలతో చాలామంది పుస్తకాలు , పజిల్స్ వంటివి అలవాటు చేయాలనుకుంటారు. తినేటప్పుడు దృష్టిని మరల్చే ఏదైనా మంచిది కాదు. బదులుగా వాళ్లతో కలిసి తినటం , కబుర్లు చ్ప్పటం లాంటివి చేయండి. బొమ్మలను పక్కన పెట్టుకోనివ్వండి. త్వరగా తింటే ఆడుకోవచ్చన్న ఉద్దేశ్యంతో అయినా తిండి పై దృష్టి పెడతారు.
నియమం పెట్టుకోండి
రోజులో ఒక్కపూటైనా కలిసి తినాలనే నియమం పెట్టుకోండి. యెంత బిజీగా ఉన్నా దానిని పాటించండి . ఇదీ వాళ్లలో మంచి అలవాట్లను పెంపొందిస్తుంది. ఆ సమయంలో పెద్దలూ ఫోన్లను పక్కన పెట్టేయాలి. అపుడు పిల్లలూ పాటిస్తారు.
స్వస్థ (ఆరోగ్య విషయాలు ) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/
జూ. ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ కుటుంబంలో…
ఓటిటిలు వచ్చినప్పటి నుండి చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ఏ సినేమైనా రిలీజ్ అయినా రెండు వారాల్లోపే…
పక్కా కమర్షియల్ నుండి కమర్షియల్ ట్రైలర్ వచ్చి ఒక్కసారిగా సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ప్రతి రోజు పండగే లాంటి…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసారు. బలపరీక్షకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.…
రెండు , మూడు రోజులుగా తనపై వస్తున్న పెళ్లి వార్తల ఫై హీరో రామ్ క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి వార్తల్లో…
కరోనా కారణంగా కొన్ని నెలల పాటు థియేటర్స్ మూతపడడంతో సినీ లవర్స్ ఓటిటికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్…