అందరి ముందు నిందించొద్దు

పిల్లల సంరక్షణ -పెద్దల బాధ్యతలు

Parents Angry
Parents Angry

పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలించడం మామూలే. అయితే కొందరు పేరెంట్స్‌ అందరిముందూ తమ పిల్లలను తిట్టడం, వారిపై గట్టిగా అరవడం చేస్తుంటారు.

అందరి ముందూ అరిసై అయినా బుద్దిగా ఉంటారని భావిస్తారు తల్లిదండ్రులు. కానీ దాని ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ అలవాటును వీలయినంల తొందరగా మానేయాలి.

ఎందుకంటే.. పిల్లల మనసు తెల్లకాగితం లాం టిది. వారు ఏది చూస్తారో అదే వారి మనసులో బలంగా నాటుకుపోతుంది.

నలుగురిలో పిల్లలను పదేపదే తప్పు పట్టడం, తిట్టడం వల్ల వారు అవమానంగా భావిస్తారు. తమ తోటి పిల్లలతో వారు కూడా అదే విధంగా ప్రవర్తించే అవకాశముంది.

అంతేకాదు తమలోని కోపాన్ని ఏదో రూపంలో బయటకు వెళ్లగక్కడం అలవాటు చేసుకుంటారు.

పేరెంట్స్‌ ప్రతి చిన్నదానికి నలుగురి ముందు తిడుతూ ఉంఏ పిల్లలు చాలా విషయాలు దాస్తారు. ఒక్కోసారి ఎదురు సమాధానం చెబుతుంటారు.

అందుచేత పిల్లలు పెద్ద పొరపాటు చేసినా కూడా వారిని అందరి ముందు నిందించొద్దు. తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మకం ఉంచాలి.

ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకూడదని పిల్లలకు తెలిసేలా చేయాలి. అందుకోసం పేరెం ట్స్‌ పిల్ల లకు నెమ్మదిగా నచ్చజెప్పాలి. వారిని ఒంటరిగా పిలిచి మదిలిం చాలి.

ఇలా చేయ డం వల్ల వారు సరైన దారిలో నడిం చేందుకు బాటలు వేసిన వారవుతారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/