పిల్లలకు ఓపిగ్గా చెప్పాలి

CHILD CARE--
CHILD CARE–

పిల్లలకు ఓపిగ్గా చెప్పాలి

అమ్మానాన్నలు తమతో మాట్లాడే తీరును బట్టే పిల్లలు తమపై ఒక అభిప్రాయానాఇన, నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. పెద్దల మీద గౌరవం పెరగటానికి, ఇతరులతో మాట్లాడే విధానం అబ్బటానికీ ఇదే మూలం. తమ మాటలను తల్లిదండ్రులు వింటున్నారని, అర్ధం చేసుకుంటాన్నరనే సంగతే పిల్లలకు ఎంతో ఉత్సాహానిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. పిల్లల మాటలు పట్టించుకోకపోతే వెంటనే చిన్నబుచ్చుకుంటారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో కుంగిపోతారు. దీంతో పిల్లలకు తల్లిదండ్రులపై నమ్మకమూ లేకుండా పోతుంది. కాబట్టి పిల్లల మనసెరిగి మాట్లాడటం మంచిది. పిల్లలకు సరిగ్గా అర్ధమయ్యేలా, విషయాన్ని గ్రహించేలా చెప్పడం అన్నది కష్టమైన పనే. పిల్లల మనసు తెల్ల కాగితంవంటిది. దాని మీద పడిన ముద్రలు చాలా కాలం ప్రభావం చూపుతాయి.

మానసిక వికాసం పెరుగుతున్న వారిలో నిరాశా నిస్పృహలు ఆవరించకుండా సానుకూల భావనలతో ఉండేలా మాట్లాడితే అది వీరి జీవితానికి బాటలు వేస్తుంది. మంచి వ్యక్త్తిత్వం, ఆత్మవిశ్వాసం ఉన్న వారుగా ఎదుగుతారు. పిల్లల ఏ విషయంలోనైన ప్రశ్నించినపుడు వారికి అవసరమైన సమాచారం ఇవ్వడానికే ప్రయత్నించాలి. ఆయా అంశాలు మనకు ఇష్టం లేకున్నా సవివరంగా చెప్పడానికి ప్రయత్నించాలి. అంత అవసరం లేదులే అనుకుంటూ వారికి దురభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు చెప్పగలిగితే చాలు. ఎంత అవసరమో అంతవరకే వివరించాలి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవని అనుకోవద్దు. ప్రశ్నలు అడినప్పుడు విసుక్కోవద్దు. పిల్లలు ఎలాంటి విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారికి ఆసక్తి కలిగిస్తున్న

వేంటో అనేవి తెలుసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు బాగా ఉపయోగపడతాయి. చిన్నారులకు రకరకాల ంసదేహాలు వస్తుంటాయి. వాటిని వెంటనే అడిగేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు అడిగిన వాటికి మనకు సమాధానం తెలియకపోవచ్చు. అన్ని విషయాలూ మనకు తెలియాలనేమీ లేదు.

అంత మాత్రాన మొహమాట పడాల్సిన పనిలేదు. ఏదైనా తెలియకపోతే తెలియదు అని అంగీకరించడమే మంచిది. ఒకవేళ తప్పుడు సమాధానం చెబితే తరువాత అది తప్పని తేలితే పిల్లల దృష్టిలో చులకనైపోతాం. కావాలంటే ఇలాంటి సందర్భాలను అవకాశంగా మార్చుకోవచ్చు. దీనికి సమాధానమేంటో చూద్దాం అంటూ ఏదైనా పదం గురించి అడినప్పుడు అలా ప్రోత్సహించాలి. అలాగైతే పిల్లలకే కాదు, మనమూ మెదడుకు పదును పెట్టినట్లు అవుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉండే కొందరికి కుటుంబంతో, పిల్లలతో గడిపే సమయం అంతగా చిక్కకపోవచ్చు.

ఇలాంటివాళ్లు వారానికో, నెలకో, ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని కుటుంబమంతా కలుసుకునేలా చూసుకోవడం మంచిది. వీటిల్లో పిల్లలకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలను, సమస్యలను కలబోసుకోవడానికి ఇలాంటి భేటీలు బాగా ఉపయోగపడతాయి. తమకు జరిగిన అనుభవాలలో ఎదురైన సంఘటనలను గుర్తుచేసుకోవడానికి దోహదపడతాయి. అలాంటప్పుడు పిల్లల్లోను కొత్త ఆలోచనలు ఉదయించడానికి మార్గం వేస్తాయి. పిల్లల స్థాయిని గుర్తించి, వారికి తేలికగా అర్ధమయ్యేలా మాట్లాడటం ముఖ్యం. మన మాటల్లోని ఉద్దేశమేంటో పిల్లలు గ్రహించేలా చూసుకోవడం ప్రధానంగా చూసుకోవాలి. వాడిని కొట్టడం తప్పు. నువ్వే బాగా చూసుకోవాలి అని తన కన్నా చిన్నవారికి విషయంలో పిల్లలకు చెబితే ఆ మాటలు చిన్నారు మనసుల్లో నాటుకుపోతాయి. పిల్లలతో మాట్లాడేప్పుడు మనలోని భావాలను, ఆలోచనలు కలబోసుకోవడమూ ఎంతో మేలు చేస్తుంది. వీటి ద్వారా నైతిక విలువలు నేర్పించవచ్చు. సేవాదృక్పథం వంటి విషయాలను పిల్లలకు అర్ధమయ్యేగా ఉదాహరణలతో సహా చెబితే భవిష్యత్తులో వాళ్లు కూడా అలాంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలకు మనమే మంచి మాటలతో వారిలో మాససిక వికాసాన్ని పెంచాలి మరి!