పిల్లలు ఎదురు చెబుతున్నారా?

పిల్లలు , సంరక్షణ

child behaviour
child behaviour

పిల్లలు ఎదురు చెబితే మహా కోపం వస్తుంది కదా.. అసలు వెళ్లేందుకు ఆలా ప్రవర్తిస్తారో , అలంటి సందర్భాల్లో ఎలా అదుపు చేయాలో తెలియక పేరెంట్స్ తలపట్టుకోవటం తెలిసిందే. ఈ సమస్య గురించి మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ , ఆదరణ కోరుకుంటారు. తమకు అమ్మ , నాన్న లు ప్రాధాన్యం ఇవ్వటం లేదనిపిస్తే ఆ బాధతో ఎదురు చెబుతారు. కనుక మనసులో ఇష్టముంది కదా, దాన్ని పైకి వ్యక్తం చేయాల్సిన పనేముంది అనుకోవద్దు. వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించండి.. ఆత్మీయంగా మాట్లాడండి. లేదంటే తమను పక్కన పెడుతున్నారనే భావనాతో ఒంటరితనం అనుభవిస్తారు. ఆ దిగులు వారు కోపంగా మాట్లాడేట్టు చేస్తుంది.

పిల్లలకు ఏది మంచో,, ఏది చెడో చెప్పాల్సిందే. కానీ , ప్రతి విషయంలో అదుపు చేస్తూ ఆంక్షలు విధించటం సరికాదు. దానివల్ల వారిలో ఒక రకం కసి, కూపం బయలుదేరతాయి.

సరదాలూ, సంతోషాలు కూడా ఆవసరమేనని మర్చిపోవద్దు. ఈ పాఠం నేర్చుకున్నావంటే ఆడుకోవటానికి పంపిస్తాను. ముందు పండ్ల రసం తాగితే ఆనక నీకు ఇష్టమైన ఫ్రెంచ్ పరిచే ఇస్తా… తరహాలో చెప్పి చూడండి.. ఆశించిన ఫలితం కన్పిస్తుంది ఏవిషయంలో నైనా వ్యతిరేకత ఉంటాయి తప్పకుండా వ్యక్తం చేయొచ్చు.. కానీ చెప్పే పద్దతి సౌమ్యంగా ఉండాలి. లేదంటే వ్యక్తిత్వ లోపం అవుతుందని అర్ధమయ్యేలా చెప్పండి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/