బ్యాలెట్‌ పత్రాలు .. ఇకపై చరిత్రే

Chief Election Commissioner (CEC)  Sunil Arora
Chief Election Commissioner (CEC) Sunil Arora

Mumbai: బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని, బ్యాలెట్‌ పత్రాలు ఇక చరిత్రగా మిగిలిపోతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) సునీల్‌ అరోరా అన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అధికారులతో, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం అరోరా ప్రెస్‌ మీట్‌లో మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారని, అది సాధ్యం కాదని చెప్పామని, అది ఇకపై చరిత్రేనని ఆయన అన్నారు. ఇవిఎంలు సరిగ్గా పని చేయకపోవచ్చునేమో కాని, వాటిని ట్యాంపర్‌ చేయడం మాత్రం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.