చిదంబరం భార్యకి, కుమారుడికి సుప్రీం నోటీసులు

Karti Chidambaram, Nalini Chidambaram
Karti Chidambaram, Nalini Chidambaram

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం భార్య నళిని చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరంలకు సుప్రీంకోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఓ నల్లధనం కేసులో వీరిపై నేర అభియోగాలను కొట్టివేస్తూ గత సంవత్సరం మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఐటీ శాఖ పిటిషన్‌ వేయడంతో.. సుప్రీం ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.చిదంబరం సతీమణి నళిని, కుమారుడు కార్తీ, కుమర్తె శ్రీనిధిలకు విదేశాల్లో అక్రమాస్తులు, రహస్య బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఓ వైపు నళిలి, కార్తీ చిదంబరాలకు నోటీసులు జారీ చేస్తూనే… 2018లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తిరస్కరించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/