ఇల్లు ఖాళీ చేయాలని ఇడి ఆదేశం

Kaarthi
Kaarthi

New Delhi: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తన నివాసం ఖాళీ చేసి వెళ్లాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) అధికారులు నోటీసు జారీ చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈ ఇంటిని ఇ.డి. అధికారులు జప్తు చేశారు. పది రోజులలోగా ఇంటిని అప్పగించాలని ఆదేశిస్తూ కార్తీకి ఇ.డి. అధికారులు తమ నోటీసులో పేర్కొన్నారు.