27న ఢిల్లీలో చిదంబరం కమిటీ సమావేశం

CHIDAMBARAM
CHIDAMBARAM

27న ఢిల్లీలో చిదంబరం కమిటీ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర విభ జనకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై 27న హస్తినలో చిదంబరం నేతృత్వంలోని పార్ల మెంటరీ స్టాండింగ్‌ కమిటీ హోంఎఫైర్స్‌ సమా వేశం జరుగుతుంది. ఈమేరకు పూర్తి సమాచా రంతో హస్తినకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు ఉత్తర్వులు అందాయి.

శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సమావేశాన్ని పార్లమెంట్‌ హౌస్‌ లోని రూం నంబరు 62లో నిర్వహిస్తున్నారు. విభజన అంశాలకు సంబంధించిన పూర్తి అం శాలను 25లోగా సభ్యులందరికీ అందించాలని కూడా ఈ సర్కులర్‌లో డైరక్టర్‌ విమల్‌కుమార్‌ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారంకాని అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 విషయంలో ఇంకా విభజన జరగాల్సి ఉంది. ప్రభుత్వరంగం సంస్థల విషయంలో ఆస్తుల పంపకం పెండింగ్‌లో ఉంది. వాటి పరిష్కారంకోసం ఈ కమిటీ చర్చ జరుపుతుంది. చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ ఈ సమావేశానికి హాజరుకావడం లేదు.

దీంతో ఎపికి రాష్ట్ర ఉన్న తాధికారులు ప్రేమ్‌ చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్‌ దాస్‌, ఎపి ప్లానింగ్‌ కమిషనర్‌ వైస్‌చైర్మన్‌ కుటుంబరావు హాజరవుతున్నారు.