కస్టడీ ముగిసింది.. జైలుకు చిదంబరం

chidambaram
chidambaram


న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరాన్ని గురువారం తీహార్‌ జైలుకు తరలించారు. సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన గురువారంతో కస్టడీ ముగిసింది. చిదంబరం పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసును విచారించిన కోర్టు ఈనెల 19 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో గురువారం ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. చిదంబరం ఆర్థిక మంత్రిగి ఉన్న సమయంలో తనకుమారుడు కార్తీ చిదంబరానికి లబ్ధి చేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై నేరారోపణలు ఉన్న విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/