చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

chidambaram
chidambaram


న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుతో తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంరం బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో ఆయనకు మరోసారి నిరాశ ఎదురైంది.ఈకేసులో సాధారణ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఆయనకు వ్యతిరేక నిర్ణయం వెలువడింది. బెయిల్‌ మంజూరు చేయాలంటూ చిదంబరం గతవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూహైకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. సాధారణ బెయిల్‌ పిటిషన్‌తోపాటుతన ను జ్యుడిషియల్‌కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూచిదంబరం మరోపిటిషన్‌కూడా దాఖలుచేశారు.ఇందుకు సంబంధించినవివరాలు తెలియాల్సిఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/