కోళ్ల ఫారాలను తాకిన కరోనా బూచి

కొనేవారు లేక షేడ్‌లకే పరిమితం అయిన కోళ్లు

chicken-sales-reduced-medak-due-covid-19-corona-virus
chicken-sales-reduced-medak-due-covid-19-corona-virus

మెదక్‌: కరోనా వైరస్‌ పౌల్ట్రీ ఫారం నిర్వహకుల పాలిట శాపంగా మారింది. చికెన్‌ తింటే కరోనా వ్యాధిసోకుతుందని కొందరు సోషల్‌ మీడియాలో కథనాలు పెట్టడంతో చికెన్‌ తినేందుకు జనం జంకుతున్నారు. కొనేవారు లేక రెండు నెలలు నిండినా కోళ్లు షేడ్‌లలోనే మగ్గుతున్నాయి. దీంతో ఫాల్ట్రీ రైతులు తీవ్రనష్టాల పాలవుతున్నారు. మెదక్‌ జిల్లాలో సుమారు 1,876 కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో చెప్పుకోదగ్గ నీటి ప్రాజెక్టులు లేక పోవడంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయంలో వరుసనష్టాలు వస్తుండటంతో కొందరు రైతులతో పాటు నిరుద్యోగులు బ్యాంకుల్లో రుణాలు పొంది కోళ్లఫారాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ప్రపంచాన్ని వణికించే కరోనా వైరస్‌ కోళ్లను తింటే వస్తుందని కొందరు సోషల్‌ మీడియాల్లో కథనాలను పెట్టడంతో చికెన్‌ అమ్మకాలు భారీగా తగ్గాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/