ఛత్తీస్​గఢ్​ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

ఛత్తీస్​గఢ్​ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో 11 మంది మృతి చెందారు. భటపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బలోడా బజార్‌- భటపరా రహదారిపై ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీ కొన్నాయి. పికప్ వ్యాన్ లో 11 మంది మృతి చెందగా , మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరంతా గురువారం రాత్రి ఒక ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. భటపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప హాస్పటల్ కు తరలించారు. చనిపోయిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు. ఇక మృతి చెందిన వారంతా సిగ్మా లోని ఖిలారా గ్రామానికి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భటపరా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిద్ధార్థ భఘేల్ తెలిపారు.