మేధస్సును పెంచే చదరంగం

Playing Chess

చదరంగంలో బొమ్మల పావులు మరీ కొత్తవేం కాదు. మధ్యయుగం నుంచీ నాటి రాజ్యాలని పోలిన పావ్ఞల్ని తయారుచేయడం వాడుకలో ఉంది. పావ్ఞలతోబాటు బోర్డుల్నీ ఎంతో విలువైన రాళ్లతోనూ లోహాలతోనూ చేసేవారు. పైగా వాటికి రత్నాలు పొదిగి, బంగారు నగిషీలు దిద్దేవారు. కొందరయితే బోర్డుని సైతం ఓ కోటలా రూపొందిచేవారు. అలాగే పావ్ఞల్ని కూడా బోర్డులోపలే పెట్టుకునేలా ఇంకా చెప్పాలంటే ఓ బోషాణంలా చదరంగం బోర్డుని డిజైన్‌ చేసేవారు.

చదరంగం… ఈ ఆట తెలియని వారుండరు. పురాణాకాలం నుంచి వస్తున క్రీడ ఇది. ఇది సరదా క్రీడ అయినా, మేధస్సును పెంచుతుంది. అక్బరు సరదాకోసం అప్పుడప్పుడూ గడుల్లో నేరుగా మనుషుల్ని నిల్చోబెట్టి చదరంగం ఆడేవాడట, ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి,బొమ్మలతో చెస్‌ ఆడుతున్నారు. దేశాలూ ప్రాంతాలూ తెగలూ పౌర యుద్ధాలూ కామిక్‌ హారర్‌ చిత్రాల్లోని క్యారెక్టర్లూ జంతువ్ఞలూ పక్షులూ.. ఆ ఆట గురించి అస్సలేమీ తెలీనివాళ్లనీ ఆకర్షస్తోంది.


Playing Chess

ఈ జీవితం ఓ చదరంగం ఎన్నో ఎత్తుపల్లాలూ.. ఎత్తులూ పైయెత్తులూ, సరైన ఎత్తు వేస్తే చదరంగంలో విజయం సరైన అడుగు వేస్తే జీవితంలో గెలుపు.. అంటూ చదరంగం గురించి కొందరు భాష్యం చెబితే, ఎనిమిదీ ఇంటూ ఎనిమిదీ ఆరవై నాలుగు గడులు… ఆరవై నాలుగు కళలకు సంకేతాలు. ఒకదాని తరువాత ఒకటి ఉండే ఆ నలుపు, తెలుపు రంగులు జీవితంలోని సుఖదుఃఖాలకి ప్రతిబింబాలు, అని మరికొందరూ, చూడ్డానికి గడులమీద జరిగే యుద్ధంలానే ఉన్నా అవతలి వారి మేధను చిత్తు చేసే ఓ అద్భుత యుద్ధ క్రీడ అని ఇంకొందరూ చెప్పుకొచ్చారు.

ఎవరు ఎలా నిర్వచించినా మొత్తమ్మీద చదరంగం మేధావ్ఞల ఆటగానే మనందరికీ తెలుసు. అలాగే చదరంగం బోర్డు అనగానే నలుపూ, తెలుపూ గడులూ వాటిమీద అవే రంగుల్లో ఉండే 32 పావ్ఞలే అందరికీ సుపరిచితం. అవికూడా కార్డుబోర్డు లేదా చెక్కతో చేసినవే అందరికీ తెలుసు. కానీ ఆ బోర్డునీ పాన్‌లనీ కూడా అద్భుత కళావస్తువ్ఞలుగానూ, పౌరాణిక, చారిత్రక, సామాజిక అంశాలను ప్రతిబింబించే రకరకాల థీమ్లతోనూ రూపోందిస్తున్నారు.

అలాగే వాటిని కేవలం చెక్క, కార్డుబోర్డు పదార్థాలే కాకుండా ప్లాస్టిక్‌, వినైల్‌, మార్బుల్‌, గాజు, ఇనుము, వెండి, బంగారం, రత్నాలతోనూ అందమైన ఆటవస్తువ్ఞలుగా కొలువ్ఞదీరుతున్నాయి.
ఈ ఆట భారతదేశంలోనే గుప్తులకాలంలో చతురంగంగా పుట్టి చదరంగంగా మారిందనీ అక్కడి నుంచే పర్షియాకీ తద్వారా ఐరోపా దేశాలకూ పాకిందనీ చరిత్రకారులు చెబుతుంటారు.

వెనకటి కాలంలో తమ రాజ్యం మీదకి ఇతరులు దండెత్తకుండా ఉండేందుకు అశ్వ, గజ, రథ, కాల్బలాలనే పెంచి పోషించేవారు రాజులు. రకరకాల వ్యూహాలు పన్ని తమ బలగాలతో యుద్ధాలు చేసి రాజ్యాలను కాపాడుకోవడం, గెలుచుకోవడం చేస్తుండేవారు. ఒక రాజు మరో రాజుని ఓడించడానికీ చంపడానికీ ఏ బలగాన్ని ఎప్పుడు రంగంలోకి దించాలో ఎలా ముందుకు కదపాలో ఆలోచిస్తూ అవతలివారి ఎత్తుకి పై యెత్తు వేస్తూ యుద్ధం చేసేవారు. అందులోంచి పుట్టుకొచ్చిందే చదరంగం. అప్పట్లో చాలామంది రాజులూ ప్రముఖులూ మాత్రమే ఈ ఆట ఆడేవారట. అందుకే దీన్ని రాజుల ఆట (గేమ్‌ ఆఫ్‌ కింగ్స్‌) అనీ పిలుస్తుంటారు.

ఈ ఆట ద్వారా తమ బద్ధిబలాన్ని పెంచుకునేవారు. ఆ కారణంతోనే అది క్రమంగా మేదావ్ఞల ఆటగా పరిణమించింది.
సాధారణంగా ఇద్దరు మాత్రమే ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరికి ఒక రాజూ, ఒక రాణీ/ మంత్రి, రెండు శకటాలూ, రెండు గుర్రాలూ, రెండు ఏనుగులూ, ఎనిమిది భటులతో మొత్తం పదహారు పావ్ఞలు ఉంటాయి. ఆరు రకాల పావ్ఞలతో రసవత్తరంగా సాగే ఈ ఆటకోసం బోర్డునీ పావ్ఞల్నీ కూడా ఎక్కవగా చెక్క,ప్లాస్టిక్‌ పదార్థాలతో మాత్రమే చేస్తుంటారు. అయితే ఇటీవల వాటిని విభిన్న పదార్థాలతో కొత్తకొత్తగా చేసేస్తున్నారు.
చదరంగంలో బొమ్మల పావ్ఞలు మరీ కొత్తవేం కాదు. మధ్యయుగం నుంచీ నాటి రాజ్యాలని పోలిన పావుల్ని తయారుచేయడం వాడుకలో ఉంది. పావ్ఞలతోబాటు బోర్డుల్నీ ఎంతో విలువైన రాళ్లతోనూ లోహాలతోనూ చేసేవారు. పైగా వాటికి రత్నాలు పొదిగి, బంగారు నగిషీలు దిద్దేవారు. కొందరయితే బోర్డుని సైతం ఓ కోటలా రూపొందిచేవారు.

అలాగే పావ్ఞల్ని కూడా బోర్డులోపలే పెట్టుకునేలా ఇంకా చెప్పాలంటే ఓ బోషాణంలా చదరంగం బోర్డుని డిజైన్‌ చేసేవారు. అయితే అవన్నీ కేవలం సంపన్న వర్గాల ఇళ్లలో మాత్రమే కనిపించేవి. నాటి చెస్‌బోర్డుల్లో చాలావరకూ యాంటిక్‌లుగా ప్రదర్శనశాలల్లో కొలువ్ఞదీరితే, కొన్ని మాత్రం ఆక్షస్‌హౌస్‌ల్లో కొట్ల రూపాయలు ఖరీదు పలుకుతూ సేకర్తలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఆత్యధికంగా 103 దేశాలకు చెందిన570 చదరంగం సెట్లు ఉన్న మ్యూజియం టర్కీలోని గోఖ్యా§్‌ు అసోసియేషన్‌ చెస్‌ వీటిల్లో ఎక్కవగా పాలరాయి. సోప్‌స్టోన్‌, ఫెల్డ్‌,షిట్‌ మెటల్‌, పోతపోసిన ఇనుము వంటి పదార్థాలతో చేసినవే అదే స్పూర్తితో ఎప్పుడు కొన్ని బ్రాండెడ్‌ జ్యూవెలరీ సంస్థలు కూడా వజ్రాలూ రత్నాలూ పొదిగిన చెస్‌ సెట్లనే తయారుచేస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి.
మనదగ్గర ఇతిహాసాలనూ పావ్ఞల్లో కదుపుతున్నారు ఆధునికులకోసం అనేక రకాల థీమ్లతోనూ చెస్‌ సెట్స్‌ వస్తున్నాయి.

జంతువ్ఞలూ పక్షులూ హారర్‌ చిత్రాలూ కామిక్‌ క్యారెక్టర్లూ.. ఇదీ అదీ అన్న తేడా లేకుండా రకరకాలుగా చదరంగం పావ్ఞల్ని తయారుచేస్తున్నారు. పూరం కలహారీ ఎడారిలో తొలినాటి ఆఫ్రికన్‌ తెగల మధ్య ఎన్నో పోరాటాలు జరిగేవి వాటిని సూచించే చదరంగం పావ్ఞలూ అక్కడ అనేకం. ముఖ్యంగా ఈ చదరంగం పావ్ఞల తయారీలో ఆఫ్రికాకి చెందిన కుంబులా ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ తయారయ్యే ప్రతీ చెస్‌ బోర్డులో రంగుల్ని తప్ప డిజైనుని మార్చకున్నా పావుల్ని మాత్రం ఈజిపిషయన్లూ, చైనీయులూ, ఐరోపా వాసులూ… ఇలా ఎవరి నేపథ్యానికి తగ్గట్లుగా వాళ్లు తయారు చేసుకుంటున్నారు.

తాజా నిఘా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/