చేతులు మారుతున్న చెన్నై డయాగ్నాస్టిక్‌ సెంటర్‌

టేకోవర్‌ చేయనున్నట్టు మెట్రో పోలీస్‌ హెల్త్‌కేర్‌ ప్రకటన

Metro Police Healthcare
Metro Police Healthcare

చెన్నై: చెన్నైకి చెందిన అగ్రగామి డయాగ్నాస్టిక్‌ సర్వీసులను అందించే సంస్థగా పేరొందిన డాక్టర్‌ గణేషన్స్‌ హైటెక్‌ డయాగ్నాస్టిక్‌ సెంటర్‌ను టేకోవర్‌ చేయనున్నట్లు మెట్రోపొలీస్‌ హెల్త్‌కేర్‌ ప్రకటించింది. కంపెనీలో మొత్తం 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు డీల్‌ విలువ రూ.511కోట్లని మెట్రోపొలీస్‌ వెల్లడించింది.

ఈ డీల్‌తో డాక్టర్‌ గణేషన్స్‌ హైటెక్‌ డయాగ్నాస్టిక్‌ సెంటర్‌ రుణరహిత సంస్థగా అవతరించనుంది. రూ.2 ముఖ విలువ కలిగిన 4.95లక్షల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో మెట్రో పొలీస్‌కు డాక్టర్‌ గణేషన్స్‌ హైటెక్‌ డయాగ్నాస్టిక్‌ సెంటర్‌ జారీచేయనుంది.

ఈ నిధులను రుణాలను చెల్లించేందుకు అలాగే కంపెనీ అంతర్గత అవసరాలకు వినియోగించనున్నట్లు డాక్టర్‌ గణేషన్స్‌ హైటెక్‌ డయాగ్నాస్టిక్‌ సెంటర్‌ ప్రకటించింది. మరోవైపు తాజాగా టేకోవర్‌తో సోమవారం ఈ షేరు ఇంట్రాడేలో నాలుగున్నర శాతానికిపైగా లాభంతో డే గరిష్టస్థాయి రూ.2274కు చేరింది. ప్రసుత్తం ఒకశాతానికిపైగా లాభంతో రూ.2171వద్ద షేరు ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఇలో ఇప్పటివరకు 75వేల షేర్లు ట్రేడయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/