తన ఫ్లెక్సీలను తానే తొలగించుకున్న మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ

ఏ పార్టీ నేతైనాసరే ఓ కార్యక్రమానికి వెళ్తుంటే ఆ కార్యక్రమం మొత్తాన్ని తానే హైలైట్ అయ్యేలా ఉండాలని అనుకుంటాడు..భారీ ప్లెక్సీ లు , కటౌట్స్ తో నానా హడావిడి ఉండేలా చూసుకుంటాడు. అయితే ఇక్కడ ఏపీ మంత్రి మాత్రం తన ఫ్లెక్సీలను తానే తొలగించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరా అనుకుంటున్నారా..ఏపీ బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. తన ప్లెక్సీల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..స్వయంగా తన చేతులతో ఆ ప్లెక్సీలను తొలగించారు.

మంగళవారం రామచంద్రపురం లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పర్యటించబోతుండడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తన ఫ్లెక్సీల లవల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిసి స్వయంగా ఆయనే తొలగించడం విశేషం. మంత్రిపై మంచి పనిచేశారంటూ స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన వీడియోలు, ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి.