కానుక

TIPS
TIPS

కానుక

యాలకులు గాని, లవంగాలు గాని నీటితో నూరి గంధంలా చేసి రాస్తే ఎగ్జిమా దురదలు తగ్గుతాయి. వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ్జ బొప్పాయి పాలను గానీ, జిల్లేడు పాలను గానీ పసుపు నీటిలో కలిపి రాస్తూ ఉంటే ఎగ్జిమా తగ్గిపోతుంది.

కరక్కాయ పెచ్చులు, ఉసిరిక వలపు, మినపప్పు వీటిని సమానంగా తీసుకుని మెత్తగా చూర్ణం చేసి పూటకు అరస్పూన్‌ చొప్పున నేతితో తింటే త్వరగా ఎగ్జిమా తగ్గిపోతుంది.

కొబ్బరినూనెలో ఘాటైన పొగాకును నాన బెట్టి, మెత్తగా చూర్ణంలా చేసి పైన పట్టులాగ వేస్తుంటే ఎగ్జిమా, దురదలు తగ్గు తాయి. తద్వారా మీరు హాయిగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

శరీరంలో యూరిక్‌ ఆసిడ్‌ వలన కలిగే ముప్పు ఆవ్ఞ మజ్జిగ తొలగిస్తుంది. నియమబద్ధంగా ప్రతీరోజూ ఆవ్ఞమజ్జిగ తాగుతుంటే హాయిగా నిద్రపడుతుంది.
పుల్లని ఆవ్ఞ మజ్జిగ శరీరానికి రాసుకుంటే చర్మం శుభ్రపడటమే గాక నిగనిగలాడుతూ ఉంటుంది. పైత్యం కఫం మూడింటినీ తగ్గిస్తుంది. ్జ పుల్లని ఆవు మజ్జిగ తలకు రాసుకుంటే జుట్టును శుభ్రపరచడమే గాక వెంట్రుకలు నిగనిగలాడుతూ జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

రిఫ్రిజిరేటర్‌ కూడా వెనుక గోడ నుంచి గాలి తగిలేలా అమర్చితే రిఫ్రిజిరేటర్‌ లోపల భాగాలు దెబ్బతినవు.