చెలి కానుక

HAIR CARE
HAIR CARE

చెలి కానుక

తలలో పేలు ఉన్నవాళ్లు దిండుపై ముందుగా కొన్ని తులసి ఆకులను పరుచుకొని ఆపై ఓ పలచని వస్త్రం వేసి నిద్రపోతే పేలు పత్తాలేకుండా పోతాయి.

తులసి ఆకుల రసాన్ని తలకు పట్టించి ఓ రెండు గంటల తర్వాత స్నానం చేస్తే సరి. పేలు, చుండ్రు సమస్య నివారణ అవ్ఞతుంది

తులసి ఆకులను క్రమం తప్పకుండా తేనెతో సేవించిన మూత్రకోశ వ్యాధులు నివారణ అవ్ఞతాయి. పది తులసి ఆకులను కప్పుల నీళ్లలో వేసి వేడిచేయాలి. ఆకులు బాగా మరిగి, నీళ్లు సగమయ్యే దాకా కాచాలి. చల్లార్చిన తర్వాత కషాయాన్ని సేవిస్తే ఒళ్లునొప్పులు ఉపశమిస్తాయి. మరో మార్గం కూడా ఉంది. ఒక చెంచా తేనెలో ఆరగ్రాము దాల్చిన చెక్కపొడిని కలిపి రెండు సార్లు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ఇంగువను చూర్ణం చేసి కొద్దిగా పొడిని మజ్జిగలో వేసుకుని రోజూ సేవిస్తూ ఉంటే గ్యాస్‌ సమస్య నివారణ అవ్ఞతుంది. ్జ మర్రి చెట్టు ఆకుల చూర్ణంతో పళ్ళుతోముకుంటే పళ్లు కదులుట, నలుపు, పంటినొప్పులు, నివారణ అగుతాయి.

ఉమ్మెత్తాకు రసాన్ని శరీరానికి రాసిన చర్మరోగాలైన గజ్జి, తామర. చిడుము తదితర సమస్యలు నివారణవ్ఞతాయి.
తంగేడుచూర్ణం వస చూర్ణమును సమానంగా కలిపి ఒకటి లేదా రెండు గ్రాములు మజ్జిగతో వాడితే గ్యాస్ట్రిక్‌ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి.