పది మంది మెచ్చుకునేలా

CUTE==
CUTE

పది మంది మెచ్చుకునేలా

విజయం సాధించిన వ్యక్తికి సమాజంలో ఓ గుర్తింపు లభిస్తుంది. గౌరవం, మన్నన, మర్యాద విరివిగా లభిస్తాయి. అతనిని అభిమానించేవారు అతని విజ యానికి జయజయ ధ్యానాలు చేసేవారు పెద్దసంఖ్యలోనే ఉంటారు. పదిమంది లోకి వచ్చినపుడు ఫలానా వ్యక్తి అని పదిమంది అతడ్ని గుర్తించే స్థాయికి అతని కీర్తి చేరుకుంటుంది. అతని కీర్తి దశదిశలా మార్మోగుతుంది. పది కాలాల పాటు సమాజం కూడా అతన్ని గుర్తు పెట్టుకోగల్గుతుంది. వి కష్టపడి జీవితంలో పైకి రావాల న్న తపన తప్ప తప్పుడు త్రోవ త్రొక్కాలన్న ఆలోచనలు మీకలలో కూడా రాకూడదు. కష్టమనే పంజరం లో నీమనసు బందీ అయినా, బాధల చక్రబంధంలో ఈ జీవితం చిక్కుకు పోయినా పెదవ్ఞలపై చిరునవ్ఞ్వ, ముఖం పై ధరహాసం చెరగనీయకండి. నిత్యం సూర్యోదయాన్ని కనులారా తిలకించే ప్రయత్నం తప్పకుండా చేయండి. వి సమాజంలో మీచుట్టూ ఉన్న అందరూ మి మ్మల్ని మంచివాడు అనాలి. ఏఒక్కరూ మిమ్మల్ని చెడ్డవాడనడం కానీ, విమర్శించడంకానీ చేసే స్థా యిలో మీప్రవర్తన ఏమాత్రం ఉండకూడదు. నిజాయితీగా బ్రతకాలన్న తపనతో నిజాయితీ పరుడు అన్నపేరు తెచ్చుకోవాలి. నీతిబాహ్యమైన పనులకు దూరంగా ఉండాలి. దుర్వ్యసనాల నీలి నీడలు కూడా మీజీవితాన్ని తాకకూడదు. విఇతరుల అభిప్రాయాలను గౌరవించుకోండి.కానీ మీ అభిప్రాయానికి విలువయివ్వండి.

మీ జీవి తంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మీ మనస్సాక్షి సరైన దిక్సూచి. దానివిశ్వసించి అడు గులు వేయగలిగితే నిర్ణయాలు తీసుకోగలిగితే మీ పట్ల మీకు గౌరవం హెచ్చుతుంది.గతంలోని చేదు అనుభవాలు, జ్ఞాపకాలు పరిమితంగానే గుర్తుం డాలి. గతం అనేది ప్రతిరోజునూ తనలాగే గడపమనదు. జీవితం అనేది ముందడుగు మార్గమే. వెనక్కి వెళ్లాలన్నా వెళ్లలేనిది. వర్తమానానికి విలువ ఇచ్చినవారే విజయం సాధించగలరు. జీవితం చివరిలో దిగులు బాధగులుగు తుంది. వెనక్కి తిరిగి సమీక్షించుకున్నప్పుడు తాను ఏమి అందుకున్నాననే ప్రశ్న తలెత్తుతుంది.
ప్రతిరోజూ మినిమం ముగ్గురు వ్యక్తుల కయినా మీ అభినందనలు అందిం చండి. ఆప్తులు, మిత్రులు, బంధువ్ఞలు, అయినవారు, ఆత్మీయులు అంతో ఇంతో పరిచయం ఉన్నవారు ఎదురయితే వారు మిమ్మల్ని పలకరించేదాకా ఎదురుచూడకండి. ముందుగా మీరే వారిని పలకరించండి. మీ మనసులో ఎదుటివారి పట్ల ఉన్న ఉన్నత భావం ఆత్మీయతానురాగాలు వ్య క్తంచేసే ఏ అవకాశాన్నీ జారవిడు చుకోకండి. ఎదుటివారు మిమ్మల్ని గౌరవించినా, గౌరవించకపోయినా వార్ని గౌరవించటం మీ కర్తవ్యంగా భావించండి.

జీవితంలో ఎవర్నీ దూరం చేసుకోకండి. ఎవరితోనూ శతృత్వాన్ని పెంచుకో కండి. శతృత్వాన్ని తృంచివేయండి. మైత్రీబంధా న్ని ఎంతయినా పెంచివేయండి. ఏమి సాధించా లన్న ప్రశ్న తొలిసారి వేసుకున్నప్పుడు ఒకటిక న్నా ఎక్కువ ఆలోచనలే ఏర్పడతాయి. జీవితా నికి అర్థమేమిటో అర్థం చేసుకుంటే సగం విజ యం సాధించనట్లు, అర్థం నిర్ణయించుకోవ టంలోనే అసలు కష్టం. వి అల్పమైన విషయాలకు సంతోషించే మన స్తత్వం మీదయినప్పుడు సులువ్ఞగా ఆనందాన్ని పొందగలుగుతారు.

అలాకాకుండా ప్రతి విషయం పూర్తిగా నచ్చాలన్న పట్టుదల మీకుంటే అడుగ డుగునా అసంతృప్తి మిమ్ములను వెంటాడుతుంది కొత్త సవాళ్లును ఎదుర్కోవటం అప్పటివరకూ మీరు చేయలేనని భావించిన పనులూ, భయ పడుతున్న పనులు చేపట్టి మీ సత్తా చాటటానికి ప్రయత్నించండి. వినీ విధుల్ని నీవ్ఞ నీకర్తవ్యంగా భావించి సక్రమంగా నిర్వర్తించు జీవితములో మనమేమిటి మనకర్తవ్యమేమిటీ మనబాధ్యత లేమిటి అన్నది మనకు మనంగా గర్తించి వాటిని విస్మరించకుండా మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ సాగాలి. జయాలకు పొంగిపోక అపజయాలకు కృంగిపోక జీవితాన్ని ఎంత విపరీత విపత్కర సమయంలోనైనా సమ తూకంతో నడిపించాలి.