చెలి కానుక

COOKING2
COOKING

చెలి కానుక

అల్లపు రసంలో తేనె కలిపి సేవించినా, మిరియాల పొడితో తేనె కలిపి తిన్నా దగ్గు త్వరగా తగ్గుతుంది. చి పాలలో టమాట రసాన్ని కలిపి రాస్తే మొటిమలు పోతాయి.

పటిక చిన్నముక్కను బుగ్గన పెట్టుకుంటే నోటిపూత త్వరగా తగ్గుతుంది.

నోటి దుర్వాసన పోవాలంటే దానిమ్మ తొక్కల్ని మరిగించిన నీటితో నోరు పుక్కిలించాలి.

ఇడ్లీపాత్రఅడుగున కమలాఫలతొక్కలు వేస్తే ఆ పాత్ర తళతళలాడుతుంది.

రాత్రిళ్లు పడుకొనేముందు ఒక గ్లాసుడు పాలలో రెండుచెంచాలు తేనె కలుపుకుని తాగితే లావుగా అవుతారు.

గొంతు బొంగురుపోతే మిరియాల గుండ కలిపిన వేడిపాలు తాగాలి. దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే గొంతులోని గురగురలు పోయి కంఠస్వరం శ్రావ్యంగా తయారౌతుంది.

బీట్‌రూట్‌ రసంలో ముంచిన దూదిని రెండు చెవ్ఞల్లోనూ పెట్టుకొంటే ఎంతటి తలనొప్పయినా వెంటనే తగ్గిపోతుంది.