పాలకూరతో బరువుకు చెక్‌

Lettuce leaves

చాలా మందిలో బరువు తగ్గడం ఒక పెద్ద సమస్య. జీవక్రియ సరిగా లేకపోతే, బరువు తగ్గడం కష్టమవుతుంది. జీవక్రియను మెరుగుపరిచేందుకు పాలకూర జ్యూస్‌ చక్కగా ఉపయోగపడుతుంది. వెయిట్‌ లాస్‌ జర్నీలో కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకుంటాం. ఆ డైట్‌ వల్ల త్వరగా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఆ డైట్‌ ప్రారంభంలో బాగానే పనిచేస్తుంది. దీర్ఘకాలంలో దాన్ని పాటించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని అనిపిస్తుంది. బరువు తగ్గితే సరిపోదు కదా. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకోసం సమతుల ఆహారం తీసుకోవాలి. ఇదంతా పద్ధతిగా జరగాలంటే మన జీవక్రియ సరిగా ఉండాలి. అందుకు పాలకూర జ్యూస్‌ చక్కటి పరిష్కారం. పాలకూర అనేక పోషకాల సముదాయం.
అనారోగ్యాన్ని దూరం చెయ్యడమే కాదు.. నిరంతరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కూడా. ఇందులో విటమిన్‌ బి ఎక్కువ. ఇది మన జీవక్రియను సహజసిద్ధంగా చురుకుగా ఉండేలా చేస్తుంది. పాలకూరలోని ఐరన్‌, మన కండరాలకు ఆక్సిజన్‌ చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. అందువల్ల కండరాలు తమ చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేస్తాయి. పాలకూరను మనం డైరెక్టరుగా గానీ, వండుకుని గానీ తీసుకోవచ్చు. అయితే జీవక్రియ మెరుగయ్యేలా చెయ్యాలంటే, పాలకూరను జ్యూస్‌లా చేసుకుని తాగడం సరైన మార్గం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/