యూఎస్‌సిఐఎస్‌ విధానంపై తాత్కాలిక నిషేదాజ్ఞలు

USCIS
USCIS

వాషింగ్టన్‌: విదేశీ విద్యార్దులపై అమలులో ఉన్న యూఎస్‌సిఐఎస్‌ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సంస్థ) ప్రతికూల విధానాన్ని అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక నిషేదాజ్ఞలు జారీ చేసింది. ఈ తాత్కాలిక ఆదేశాలతో అమెరికాలోని విదేశీ విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు కొంత ఊరట లభించింది. గత ఏడాది ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సిఐఎస్‌ విధానం ప్రకారం అక్రమంగా నివసిస్తున్న విద్యార్దులపై వేటు వేసింది. 180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై మూడేళ్లు, ఏడాదికి పైగా నివసించిన వారిపై పదేళ్లు సదరు కుటుంబంపై అమెరికా రాకుండా నిషేధం విధిస్తారు. దీనిపై పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విద్యార్ధి తెలిసో తెలియకో తన విద్యార్ధిని ఉల్లంఘించినట్లే నని తేలితే..ఆ రోజు నుంచి అతడు లేదా ఆమె అక్రమంగా నివసిస్తున్నట్లు పరిగణిస్తారు. ఈ విధానం విద్యార్ధుల పాలిట శాపంగా మారిందని పలు విద్యా సంస్థలు కోర్టుకు విన్నవించాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/