డ్రగ్స్ కేసు : ఛార్మిని 8 గంటలు విచారించి పంపిన ఈడీ అధికారులు

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సోమవారం డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను విచారించిన ఈడీ అధికారులు..ఈరోజు నటి ఛార్మి ని విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఆమెను విచారించి పంపించారు. ముఖ్యంగా ఛార్మీని అధికారులు ఆమె బ్యాంకు ఖాతాలకు సంబంధించిన విషయాలు అడిగినట్లు తెలుస్తుంది. 2016లో కెల్విన్‌తో మాట్లాడిన కాల్ డేటా.. వాట్సాప్ ఛాట్‌ను ఛార్మీకి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్‌ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మీ ఈడీ అధికారులకు తెలిపింది.

విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించాను.. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాను. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తాను’ అంటూ ఛార్మి చెప్పుకొచ్చింది. సోమవారం ఈడీ అధికారులు హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ ను విచారించబోతున్నారు. అయితే సోమవారం కాకుండా మరో తేదీన విచారించాలని కోరగా..ఆలా కుదరదని ఖచ్చితంగా సోమవారం విచారణకు హాజరుకావాలని అధికారులు రకుల్ లు తెలిపారు.