లైగర్ ప్లాప్ ఫై ఛార్మి కామెంట్స్

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేసారు. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో లైగర్ విఫలమైంది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో మొదటిరోజు మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లు పడిపోయాయి.

ఈ క్రమంలో సినిమా ప్లాప్ ఫై ఛార్మి కామెంట్స్ చేసింది. ‘లైగర్’ ఫెయిల్యూర్ నిరుత్సాహ పరిచింది. జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ తో మెరుగైన కంటెంట్ ను చూడడానికే ఇష్టపడుతున్నారు. కుటుంబం మొత్తం టీవీల్లో బిగ్ బడ్జెట్ చిత్రాలను చూడవచ్చు. థియేటర్లో చూడాలి అనే ఎగ్జైట్ చేసే సినిమాలకు తప్ప ప్రేక్షకులు మిగతా వాటి కోసం థియేటర్లకు రావడం లేదు అని తెలిపింది.

“కానీ టాలీవుడ్ లో అలా కాదు. ఆగస్ట్ లో బింబిసార – సీతా రామం మరియు కార్తికేయ 2 వంటి మూడు తెలుగు సినిమాలు అద్భుతంగా ఆడాయి. సుమారు రూ. 150–170 కోట్లు వరకు కలెక్షన్స్ అందుకున్నాయి. అలాగని సౌత్ లో సినిమా పిచ్చోళ్లు ఎక్కువని అసలేం. కాకపోతే ఇక్కడ ఉన్నట్లు బాలీవుడ్ లో లేదు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది” అని ఛార్మి తెలిపింది.

“ఒకటి కాదు రెండు కాదు ‘లైగర్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. మేము 2019లో కరణ్ జోహార్ ని కలిశాము. జనవరి 2020లో మొదటి షెడ్యూల్ ని ప్రారంభించగా.. సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటిని దాటుకొని రిలీజ్ చేశాం. థియేట్రికల్ రిలీజ్ చేయాలనే నమ్మకంతోనే మూడేళ్ళపాటు వేచి చూశాం. కానీ మా ప్రయత్నం ఆడియన్స్ కు నచ్చలేదు. లైగర్ ప్లాప్ అవ్వడం నన్ను చాలా బాధకు గురిచేసింది” అని ఛార్మీ ఎమోషనల్ అయ్యింది.