గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించిన ఇఫర్‌ విందు!

Iftar
Iftar


దుబాయ్ : ముస్లింలకు అత్యంత పవిత్రమాసం రంజాన్‌ అయితే రంజాన్‌ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే ఇఫ్తార్‌ విందులో భారత్‌కు చెందిన ఓ చారిటీ సంస్థ గిన్నిస్ ప్రపం చ రికార్డు సృష్టించింది. కాగా అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవు న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈ ఘనతను సాధించినట్టు గల్ఫ్‌న్యూస్ పేర్కొంది. ఈ రికార్డు సాధించడంలో సాయపడిన అందరికీ కృతజ్ఞతలు అని చారిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ సలారియా తెలిపారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/