రేప‌టి నుంచే చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ హైకోర్టు చార్‌ధామ్ యాత్ర‌పై ఉన్న నిషేధాన్ని గురువారం ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ఆ యాత్ర‌ను ర‌ద్దు చేశారు. అయితే రేప‌టి నుంచే ఆ యాత్ర ప్రారంభం అవుతుంద‌ని ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కోవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తూ తీర్థ యాత్ర‌ల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు అని కోర్టు పేర్కొన్న‌ది.

పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నానికి రోజూ ప‌రిమితి సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని నిబంధ‌న పెట్టింది. సంద‌ర్శ‌కుల‌కు కోవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్‌, వ్యాక్సినేష‌న్ ద్రువ‌ప‌త్రాన్ని చూపాల్సిందేన‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. చార్‌ధామ్ భ‌క్తులు య‌మునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్‌, బ‌ద్రీనాథ్ క్షేత్రాల‌ను ద‌ర్శించుకుంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/