దుబాయ్ కి చెక్కేసిన చరణ్-ఉపాసన లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కొద్దీ రోజుల పాటు సరదాగా గడిపేందుకు దుబాయ్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా చరణ్ ఎంతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్ళొవచ్చాడు. రీసెంట్ గా బర్త్ డే కార్యక్రమాల్లో బిజీ గా గడిపాడు.

ఇలా గత కొద్దీ రోజులుగా బిజీ బిజీ గా గడుపుతూ..ఉపాసన తో టైం స్పెండ్ చేయలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఉపాసన తో కొద్దీ రోజులుగా సరదాగా గడిపేందుకు ఇద్దరు కలిసి దుబాయ్ కి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన తిరిగి శంకర్ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఆయన గౌతమ్ తిన్ననూరితో చేయనున్నట్టుగా సమాచారం.