చరణ్ సాంగ్ మాములుగా ఉండదంటున్న జానీ మాస్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC15 మూవీ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా , దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పాత్రల తాలూకా కొన్ని పిక్స్ బయటకు వచ్చి సినిమా ఫై ఆసక్తి పెంచాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఏపీలో జరుగుతుంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటె ఈ మూవీ లో ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్..ఆ సాంగ్ తాలూకా విశేషాలు చెప్పి సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసారు. ఆర్ సీ 15 సినిమాకు ఒక పాటకు డాన్స్ కంపోజ్ చేయడం జరిగిందట. ఇప్పటి వరకు చేసిన పాటలు ఒక ఎత్తు అయితే ఇది మరో లెవల్ అన్నట్లుగా జానీ మాస్టర్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. రామ్ చరణ్ పై తనకు ఉన్న అభిమానం మొత్తం చూపించి డాన్స్ ను కంపోజ్ చేసినట్లుగా జానీ మాస్టర్ అన్నాడు.

ఇక ఆ పాట కూడా అద్భుతంగా వచ్చిందని.. థమన్ కూడా తన బెస్ట్ ఇవ్వడంతో పాట అద్భుతంగా వచ్చిందని పేర్కొంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పాట గురించి.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరియు థమన్ ట్యూన్స్ గురించి చర్చ నడుస్తుంది. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తుండగా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.