అక్ష‌య్ – చరణ్ డాన్స్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి డాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. వేదిక ఫై వీరిద్దరూ తూ చీజ్ బ‌డీ హై మ‌స్త్ మ‌స్త్.. అనే పాట‌కు క‌లిసి డాన్స్ చేశారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఇక రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. RRR త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో RC 15 అనే పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , శ్రీకాంత్ , అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే అర‌వై శాతానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ సోమ‌వారం నుంచి న్యూజిలాండ్‌లో జ‌ర‌గ‌నుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video